విజయదశమి వేడుకల్లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి- సరోజ దంపతులు

విజయదశమి వేడుకల్లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి- సరోజ దంపతులు

మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన విజయదశమి వేడుకల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్- రమాదేవి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి- సరోజ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ప్రజాపాలన వచ్చిన తర్వాత మొట్టమొదటి దసరా పండగ జరుపుకుంటున్నామని అన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు తమ కుటుంబంపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరూ సంతోషంగా దసరా పండగ జరుపుకోవాలని ఆకాక్షించారు.

బెల్లంపల్లి నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా డెవలప్ కావాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బెల్లంపల్లి అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. రూ. 62 కోట్లతో మంచినీటి కోసం నిధులు కేటాయించినట్లు తెలిపారు.

కాక అడుగుజాడల్లో ఎంపీ వంశీకృష్ణ.. 

ఇదే వేదికపై ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సతీమణి మాట్లాడుతూ.. తనయుడు ఎంపీ వంశీకృష్ణ.. తాత కాక అడుగుజాడల్లో నడుస్తున్నారని అన్నారు. విశాఖ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రజలు ఇలానే దీవిస్తూ ఉంటే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయయని ఆమె ప్రజలకు మాటిచ్చారు.