బెల్లంపల్లిలో దసరా ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తి

బెల్లంపల్లిలో దసరా ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తి
  • బెల్లంపల్లిలో వేడుకలకు ముస్తాబైన తిలక్ క్రీడామైదానం
  • ఉత్సవాలకు రానున్న ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ వెంకట స్వామి, వినోద్ వెంకటస్వామి

బెల్లంపల్లి, వెలుగు: దసరా ఉత్సవాల సందర్భంగా రావణ దహనానికి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నెంబర్ వన్ గ్రౌండ్, తిలక్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు.శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు రావణాసుర వద కార్యక్రమం నిర్వహించనున్నట్లు, దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

ముఖ్య అతిథిగాపెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, బెల్లంపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్ వెంకటస్వామి, గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరుకానున్నారని తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో వేలాది భక్తులు పాల్గొంటారని, రావణాసుర వధ కార్యక్రమాన్ని తిలకించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 

నిర్మల్, వెలుగు: దసరా వేడుకల కోసం నిర్మల్ జిల్లా లోని అన్ని దేవాలయాలు ముస్తాబయ్యాయి.  బాసరలోని సరస్వతి దేవి ఆలయంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని ఇప్పటికే విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.  భక్తులు పెద్ద సంఖ్యలో దసరా వేడుకల కోసం సరస్వతి దేవి ఆలయానికి తరలిరానున్న కారణంగా ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన నిర్మ ల్ పట్టణంలోని ప్రసిద్ధ మహాలక్ష్మి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. 

దసరా వేడుకలకు నిర్మల్ పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు తరలివస్తుంటారు.  దీని కోసం పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. నిర్మల్ మున్సిపాలిటీ తో పాటు స్థానిక మహాలక్ష్మి ఆలయ కమిటీ స భ్యులు, బంగల్ పేట్ యువజన సంఘం సభ్యులు ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 

దసరా వేడుకల సందర్భంగా సభ నిర్వహణ అనంతరం రావణా సుర దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని తిలకించేందుకు దాదాపు 20 వేల మందికి పైగా భక్తులు ఇక్కడికి తరలి రానున్నారు. దీనికోసం ఇక్కడి మహాలక్ష్మి గ్రౌండ్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గండి రా మన్న ప్రాంగణంలోని నందిగుండం దుర్గామాత ఆలయంలో కూడా దసరా వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.