ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరంలో పాస్టర్సంగాల పాల్సన్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీ క్రిస్మస్ వేడుకల్లో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, మండల పరిధిలోని పెద్దపెండ్యాల ఢిల్లీ పబ్లిక్స్కూల్వార్షికోత్సవంలో ఎమ్మెల్యే కడియం పాల్గొని ప్రతీ విద్యార్థికి చదువుతోపాటు నైపుణ్యం కూడా ఉండాలని సూచించారు. అనంతరం కరుణాపురం బీసీ గురుకుల పాఠశాల (బాలికలు), జఫర్ గడ్ లోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల (బాలికలు)లో ఏర్పాటు చేసిన మెనూ లాంచింగ్ కార్యక్రమానికి జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తో కలసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచడం సంతోషంగా ఉందన్నారు.