
ఎమ్మెల్యేలు కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు ఆధ్వర్యంలో తన ఫోన్ ట్యాప్ అయిందని ఆరోపించారు. తన ఫోన్ ట్యాప్ చేసి.. మూడు వాయిస్ లని మీడియాకు వదిలారన్నారు నందకిషోర్. ఫోన్ ట్యాపింగ్ వల్లనే సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయని.. ఇంతకీ సమంత ఫోన్ ట్యాపింగ్ చేసి నాగచైతన్యకి పంపించింది ఎవరని నందకిషోర్ ప్రశ్నించారు. దీని వెనక రాధా కిషన్ రావు టీం ఉందని అనుమానం ఉందన్నారు. తనపై అక్రమ కేసుల పెట్టి రాధా కిషన్ రావు తనని వేధించినట్లుగా నందకిషోర్ వెల్లడించారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డీసీపీని కోరినట్లుగా తెలిపారు. తన ఫోన్ ను, ఎమ్మెల్యేల ఫోన్ లని ట్యాపింగ్ చేయమని ఆదేశాలిచ్చింది ఎవరు ? వారిని బయట పెట్టాలని నందకిషోర్ డిమాండ్ చేశారు.