
మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీలో కార్యకర్తల సమావేశంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం బుగ్గ గుట్ట రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వేసిన రోడ్డును పరిశీలించారు. అనంతరం పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చొరవతో అటవీశాఖ పర్మిషన్లు తీసుకువచ్చి 40 యేండ్ల కష్టాలు తీర్చినందుకు ఎమ్మెల్యేలు వినోద్, వివేక్ లకు ధన్యవాదాలు తెలిపారు గ్రామస్తులు.
ఈ సందర్భంగా... ఎమ్మెల్యే వినోద్ బుగ్గ టెంపుల్ కి రోడ్డు వేయించడం ఆనందంగా ఉందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధి చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కు ఉత్సాహంగా ఉందన్నారు. రైతులకు రెండు లక్షల చొప్పున సుమారు 24వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశామని చెప్పారు ఎమ్మెల్యే వివేక్.
ALSO READ | దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించండి.. తర్వాత మేం చూసుకుంటం: మంత్రి బండి సంజయ్
బెల్లంపల్లి లో కొత్త రైళ్ళు ఆపేలా ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్ ల ద్వారా కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. బెల్లంపల్లి ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ లు కాకుండా కొత్త భూగర్భ గనులు వచ్చేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడుతానన్నారు వివేక్. బెల్లంపల్లిలో ఇంటి గ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ,ఇంజనీరింగ్ కళాశాల,ఐటీ పార్కు వచ్చేలా కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే వివేక్.
బుగ్గ రొడ్డు ప్రజలకు అంకితం: వినోద్
బెల్లంపల్లి పట్టణ ప్రజల కోరిక మేరకు ప్రేమతో అభివృద్దికి కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. బెల్లంపల్లి అభివృద్దిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించాం. అటవీశాఖ అధికారులతో కొట్లాడాను .వేమానపల్లి చెన్నూరు రోడ్డు నిర్మించేలా ఎమ్మెల్యే గడ్డం వివేక్ సహకరించాలి. మూడు జూనియర్ కళాశాలలు మంజూరు చేయించి స్థలాలు కేటాయించేందుకు జిల్లా కలెక్టర్ తో చర్చించాను. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు బుగ్గ రొడ్డును అంకితం చేస్తున్నాను అని వినోద్ అన్నారు.