కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే దేశాభివృద్ధి

  •     రెండు పర్యాయాల్లో బీజేపీ ఏం చేసింది? 
  •     బెల్లంపల్లిలో ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ ప్రచారం

బెల్లంపల్లి, వెలుగు :  దేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం  ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ అన్నారు. పదేళ్లు పాలించిన బీజేపీ పేద ప్రజలను పట్టించుకోకపోగా.. బడా పెట్టుదారులకు దోచిపెట్టారని ఫైరయ్యారు.

బెల్లంపల్లి 22వ వార్డులోని బూడిది గడ్డ బస్తీలో వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలంగాణను సర్వనాశనం చేసిన  బీఆర్ఎస్ కు ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం మనుగడ కోల్పోతుందని పేర్కొన్నారు.

బెల్లంపల్లిలో సమస్యలను పరిష్కరిస్తా

తనను ఎంపీగా గెలిపిస్తే బెల్లంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని వంశీకృష్ణ హామీ ఇచ్చారు. నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కృషి చేస్తానని చెప్పారు. కాకా వెంకటస్వామి ఆశయాలు నెరవేర్చేందుకు తాను ఎంపీగా పోటీ చేస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో  మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు

టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, బండి ప్రభాకర్ యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు సూరం సంగీత, సరిత, నాయకులు దావ రమేశ్​బాబు, మత్తమారి సత్తిబాబు, సూరం బానేశ్, పత్తిపాక రాజ్ కుమార్ లతోపాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.