మునుగోడు ఎన్నికల్లో ఇచ్చిన మాట మర్చిపోయిన ఎమ్మెల్యేలు

జైకేసారంలో కమ్యూనిటీ హాల్స్‌‌‌‌‌‌‌‌కు పైళ్ల హామీ
     లచ్చమ్మగూడెం వాసులకు నర్సన్న దర్శనం సాకారం కాలె

యాదాద్రి, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల్లో టైంలో గ్రామాలకు ఇన్‌‌‌‌‌‌‌‌చార్జులుగా వ్యవహరించి, ఓట్ల కోసం అనేక హామీలు ఇచ్చిన లీడర్లు ఇప్పుడు ఆ గ్రామాలను పట్టించుకోవడమే మానేశారు. మునుగోడు ఎలక్షన్లు ముగిసి మూడు నెలలు గడుస్తున్నా ఆ గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదు.. హామీల ముచ్చట తీయడం లేదు. పక్క జిల్లాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేల మాట ఎలా ఉన్నా.. సొంత జిల్లా ఎమ్మెల్యేలు కూడా ముఖం చాటేయడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌ మండలం జైకేసారం గ్రామానికి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సంస్థాన్‌‌‌‌‌‌‌‌ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం, చిల్లాపురం గ్రామాలకు ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించారు. ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ ప్రకటన వచ్చిన నాటి నుంచి ఎన్నిక జరిగే ముందు రోజు వరకు ఎమ్మెల్యేలు గ్రామాల్లోనే మకాం వేశారు. ఇంటింటికీ తిరగడంతో పాటు ఎవరికి తోచినట్లు  వారు హామీలు ఇచ్చారు. 

ప్రతి కులానికి కమ్యూనిటీ హాల్‌‌‌‌‌‌‌‌ అన్న పైళ్ల

చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌ మండలం జైకేసారం ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించిన పైళ్ల శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి గ్రామంలో కులాల వారీగా మీటింగ్‌‌‌‌‌‌‌‌లు పెట్టారు. శాలివాహన, యాదవ, ముదిరాజ్, గౌడతో పాటు ప్రతి కులానికి, వృద్ధులకు ప్రత్యేకంగా హాల్స్‌‌‌‌‌‌‌‌ కట్టిస్తానని హామీ ఇచ్చారు. నవంబర్‌‌‌‌‌‌‌‌ 3న ఎన్నిక ఉండడంతో 1వ తేదీన అనుచరులతో కలిసి జైకేసారం నుంచి వెళ్లిన ఎమ్మెల్యే ఇప్పటివరకు గ్రామానికి రాలేదు.. కమ్యూనిటీ హాళ్ల గురించి పట్టించుకోలేదు. అయితే కమ్యూనిటీ హాల్స్‌‌‌‌‌‌‌‌ నిర్మాణం కోసం ప్రతి కులానికి రూ. 50 వేలు అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌గా ఇచ్చారని, గౌడ కులానికి మాత్రం రూ. 50 వేలతో పాటు 50 బస్తాల సిమెంట్‌‌‌‌‌‌‌‌ కూడా ఇప్పించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మిగతా నిధులు కూడా ఇచ్చి కమ్యూనిటీ హాల్స్‌‌‌‌‌‌‌‌ కట్టించాలని ప్రజలు కోరుతున్నారు.

నారసింహుడి దర్శనం చేయిస్తానన్న సునీత

సంస్థాన్‌‌‌‌‌‌‌‌ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం, చిల్లగూడెం ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిగా వ్యవహరించిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత గ్రామస్తులందరికీ నారసింహుడి దర్శనం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల టైంలోనే గుట్టకు తీసుకెళ్లాలని అనుకున్నారు. కానీ ఇదే విషయంలో ఎమ్మెల్యే జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డిపై విమర్శలు రావడంతో సునీత వెనక్కి తగ్గారు. కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి గెలిచాక అందరినీ గుట్టకు తీసుకెళ్తానని చెప్పారు. ఆయన గెలిచి 3 నెలలు అయినా ఇప్పటివరకూ ఎమ్మెల్యే రాలేదు.. నారసింహుడి దర్శనం కల్పించలేదు. 

నర్సన్న దర్శనం చేయించలే... 

కూసుకుంట్లను గెలిపిస్తే యాదగిరి నర్సన్న దర్శనం చేయిస్తానని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత చెప్పారు. కూసుకుంట్లను గెలిపించి మూడు నెలలు అయింది. ఇప్పటివరకు ఆమె మళ్లీ రాలేదు.

- అంజమ్మ, లచ్చమ్మగూడెం