జాగారం తప్పదు: అర్ధరాత్రుల్లో మినీ ఐపీఎల్ మ్యాచులు

జాగారం తప్పదు: అర్ధరాత్రుల్లో మినీ ఐపీఎల్ మ్యాచులు

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మినీ ఐపీఎల్ సమరం రానే వచ్చింది. అగ్రరాజ్యం అమెరికా వేదికగా మొదలుకానున్న ఈ టోర్నీకి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలివుంది. అమెరికా కాలమానం ప్రకారం నేటి నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుండగా.. భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం నుంచి దేశంలో మ్యాచులు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.        

మేజర్ లీగ్ క్రికెట్(ఎంసీఎల్)లో కొన్ని మ్యాచులు భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి పూట ప్రారంభంకానున్నాయి. అర్ధరాత్రి 12, 2 గంటలకు కొన్ని.. ఉదయం 4, 6 గంటలకు మరికొన్ని మ్యాచులు మొదలుకానున్నాయి. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌ టెక్సాస్ సూపర్ కింగ్స్, లాస్ ఏంజెలిస్ నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. డల్లాస్ సమీపంలోని గ్రాండ్ ప్రైరీ స్టేడియం తొలి సమరానికి వేదిక కానుంది. 

ఈ లీగ్‌లో పాల్గొంటున్న ఆరు జట్లలో నాలుగు టీమ్స్.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెందినవే కావడం గమనార్హం. లాస్ ఏంజెలిస్ నైట్ రైడర్స్, ఎంఐ న్యూయార్క్, టెక్సాస్ సూపర్ కింగ్స్, సీటెల్ ఓర్కాస్ ములుగు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలకు చెందిన టీమ్సే. ఇవికాక శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్లు కూడా తలపడనున్నాయి. 

ఎంసీఎల్‌ 2023లో పాల్గొంటున్న జట్లు:

  • లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ 
  • శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్  
  • ఎంఐ న్యూయార్క్  
  • సీటెల్ ఓర్కాస్  
  • వాషింగ్టన్ ఫ్రీడమ్  
  • టెక్సాస్ సూపర్ కింగ్స్ 

ఎంసీఎల్‌ 2023 షెడ్యూల్:

14 జూలై: టెక్సాస్ సూపర్ కింగ్స్ vs లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ (6:00 AM)
15 జూలై: MI న్యూయార్క్ vs శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ (2:00 AM) 
15 జూలై: సీటెల్ ఓర్కాస్ vs వాషింగ్టన్ ఫ్రీడమ్ (6:00 AM)
16 జూలై: శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ vs సీటెల్ ఓర్కాస్ (6:00 AM)
17 జూలై: టెక్సాస్ సూపర్ కింగ్స్ vs వాషింగ్టన్ ఫ్రీడమ్ (2:00 AM)
17 జూలై: లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ vs MI న్యూయార్క్ (6:00 AM)
18 జూలై: టెక్సాస్ సూపర్ కింగ్స్ vs MI న్యూయార్క్ (6:00 AM)
19 జూలై: లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ v శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ (6:00 AM)
21 జూలై: లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ vs వాషింగ్టన్ ఫ్రీడమ్ (4:00 AM)
22 జూలై: సీటెల్ ఓర్కాస్ vs టెక్సాస్ సూపర్ కింగ్స్ (4:00 AM)
23 జూలై: శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ vs వాషింగ్టన్ ఫ్రీడమ్ (4:00 AM)
24 జూలై: లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ vs సీటెల్ ఓర్కాస్ (12:00 AM)
24 జూలై: MI న్యూయార్క్ vs వాషింగ్టన్ ఫ్రీడమ్ (4:00 AM)
25 జూలై: శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ vs టెక్సాస్ సూపర్ కింగ్స్ (4:00 AM)
26 జూలై: MI న్యూయార్క్ vs సీటెల్ ఓర్కాస్ (4:00 AM)
28 జూలై: క్వాలిఫైయర్ 1 (2:00 AM) 
28 జూలై: ఎలిమినేటర్ (6:00 AM) 
29 జూలై: క్వాలిఫయర్ (6:00 AM)
31 జూలై: ఫైనల్ (6:00 AM)