
మేజర్ లీగ్ క్రికెట్ కు ప్రపంచ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ఉంది. ఐపీఎల్ తర్వాత అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు ఈ లీగ్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ మెగా లీగ్ తాజాగా రిటైన్ ప్లేయర్ల లిస్ట్ ను ప్రకటించింది. ఈ లిస్టులో స్టార్ ఆటగాళ్లకు ఆయా జట్ల ఫ్రాంచైజీలు బిగ్ షాక్ ఇచ్చారు. కమ్మిన్స్, హెడ్, రబడా, మిల్లర్ లాంటి ఆటగాళ్లను రిటైన్ చేసుకోకుండా విడుదల చేశారు.వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కారణంగా కమ్మిన్స్, హెడ్ ఈ లీగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. 2025 లో జరగనున్న మేజర్ లీగ్ క్రికెట్ రిటైన్ ఆటగాళ్ల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.
డిఫెండింగ్ ఛాంపియన్స్ వాషింగ్టన్ ఫ్రీడమ్.. ట్రావిస్ హెడ్‌తో పాటు ఆ జట్టు ప్రధాన బౌలర్లు అకేల్ హోసేన్, ఆండ్రూ టైలను కూడా తొలగించింది. శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ న్యూజిలాండ్ పేసర్ మాట్ హెన్రీ, ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్, కమిన్స్ లను వదులుకుంది. వీరితో పాటు వెస్టిండీస్ ఆల్ రౌండర్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌లను కూడా ఫ్రాంచైజ్ విడుదల చేసింది.
సియాటిల్ ఓర్కాస్ దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్ క్వింటన్ డి కాక్, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్, వెస్టిండీస్ పేసర్ ఒబెద్ మెక్‌కాయ్, దక్షిణాఫ్రికా పేసర్ నాండ్రే బర్గర్ లను రిలీజ్ చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్ మిల్లర్, ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్ బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్, ఆస్ట్రేలియన్ స్పిన్నర్ ఆడమ్ జంపాను లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ విడుదల చేసింది.
MI న్యూయార్క్ దక్షిణాఫ్రికా స్టార్ పేసర్లు అన్రిచ్ నార్ట్జే,రబడ లతో పాటు పవర్-హిటర్లు టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రెవిస్ లను విడుదల చేసింది. టెక్సాస్ సూపర్ కింగ్స్ (TSK) న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తో పాటు మథీష పతిరానా, డారిల్ మిచెల్, నవీన్-ఉల్-హక్లను రిటైన్ ప్లేయర్ల లిస్ట్ నుంచి తొలగించింది.
మేజర్ లీగ్ క్రికెట్ 2025 రిటైన్డ్ ప్లేయర్స్ జాబితా
LA నైట్ రైడర్స్:
అలీ ఖాన్, ఆదిత్య గణేష్, ఉన్ముక్త్ చంద్, నితీష్ కుమార్, కార్న్ డ్రై, సైఫ్ బాదర్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, మాథ్యూ ట్రాంప్, స్పెన్సర్ జాన్సన్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్
MI న్యూయార్క్:
ఎహ్సాన్ ఆదిల్, నోస్తుష్ కెంజీల్, రుకార్ ఉకార్డ్, రుకర్ పాట్‌గేల్, సన్నీ పటేల్, కీరన్ పొలార్డ్, నికోలస్ పూరన్, రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్
శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్:
కోరీ ఆండర్సన్, హసన్ ఖాన్, లియామ్ ప్లంకెట్, కార్మి లె రౌక్స్, బ్రాడీ కౌచ్, కరీమా గోర్, జువానోయ్ డ్రైస్‌డేల్, సంజయ్ కృష్ణమూర్తి, హారిస్ రౌఫ్, ఫిన్ అల్లెన్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, మాథ్యూ షార్ట్
సీటెల్ ఓర్కాస్:
హర్మీత్ సింగ్, కామెరాన్ గానన్, అలీ షేక్, అయాన్ దేశాయ్, ఆరోన్ జోన్స్, హెన్రిచ్ క్లాసెన్, ర్యాన్ రికెల్టన్
టెక్సాస్ సూపర్ కింగ్స్:
జాషువా ట్రాంప్, కాల్విన్ సావేజ్, మిలింద్ కుమార్, మహ్మద్ మొహ్సిన్, జియా-ఉల్-హక్, సాయితేజ ముక్కమల్ల, ఫాఫ్ డు ప్లెసిస్, డెవాన్ కాన్వే, నూర్ అహ్మద్, మార్కస్ స్టోయినిస్
వాషింగ్టన్ ఫ్రీడమ్:
ఆండ్రీస్ గౌస్, ముఖ్తార్ అహ్మద్, ఒబుస్ పియెనార్, సౌరభ్ నేత్రవల్కర్, ఇయాన్ హాలండ్, అమిలా అపోన్సో, జస్టిన్ డిల్, లాహిరు మిలాంత, యాసిర్ మొహమ్మద్, మార్కో జాన్సెన్, గ్లెన్ మాక్స్‌వెల్, లాకీ ఫెర్గూసన్, రాచిన్ రవీంద్ర, జాకీన్ స్మిద్వర్డ్స్