
జనగామ, వెలుగు : జనగామ శివారు చిటకోడూరు డ్యాం సమీపంలోని పొట్టిగుట్ట మైసమ్మను ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆదివారం దర్శించుకున్నారు. మాల మహాసభ స్టేట్వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర రాజకీయాల వ్యవహారాల ఇన్చార్జి తాటి కుమార్ ఆధ్వర్యంలో అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నారు. అంతకుముందు అద్దంకి దయాకర్ దంపతులను శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ అందరూ బాగుండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్సీని కలిసిన మాల నాయకులు
తొర్రూరు: ఎమ్మెల్సీగా ఎన్నికైన అద్దంకి దయాకర్ ను మాల మహానాడు మహబూబాబాద్ జిల్లా నాయకులు ఆదివారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చిట్టి మల్ల మహేశ్ ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, జాతీయ కార్యదర్శి ఆశోద భాస్కర్, అద్దంకి సైన్యం యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు గార ఉపేందర్, మానుకోట జిల్లా ఉపాధ్యక్షుడు సంద అనిల్, తొర్రూరు డివిజన్ అధ్యక్షులు గొడిశాల నవీన్, నాయకులు ఎనమల రాకేశ్, నెల్లికుదురు మండల అధ్యక్షుడు కారం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.