హైదరాబాద్, వెలుగు: వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ సెగ్మెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. మంగళవారం సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం స్టేట్ ప్రెసిడెంట్ జంగయ్య అధ్యక్షతన వర్చువల్ గా జరిగింది.
నర్సిరెడ్డి గత ఐదున్నర ఏండ్లుగా ఎమ్మెల్సీగా విద్యారంగ అభివృద్ధికి, టీచర్ల సంక్షేమానికి కృషి చేశారని సంఘం నేతలు అభిప్రాయపడ్డారు. శాసనమండలిలో ఆయన టీచర్లు, లెక్చరర్లతో పాటు ప్రజాసమస్యలనూ ప్రస్తావించి, వాటి పరిష్కారానికి మరింత కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో మరోసారి ఆయన్నే ఎమ్మెల్సీగా పోటీలో నిలపాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.