అయిజ, వెలుగు: రాజోలి మండలం పెద్ద ధన్వాడ సమీపంలో నిర్మిస్తున్న ఇథనాల్ కంపెనీ రద్దు చేసేంత వరకు రైతులతో కలిసి పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. కంపెనీ సమీపంలో పరిసర గ్రామాల ప్రజలు, రైతులు చేపట్టిన రిలే దీక్ష బుధవారం ఏడవ రోజుకు చేరుకుంది.
దీక్షా శిబిరాన్ని బుధవారం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కంపెనీ ఏర్పాటుతో 12 గ్రామాల ప్రజలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల తరపున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.