ఖాళీలను ప్రమోషన్లతోనే నింపాలి : ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి

  • స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్​కు ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి వినతి 

హైదరాబాద్, వెలుగు: టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల తర్వాత మిగిలిన ఖాళీలను మళ్లీ ప్రమోషన్లు ఇచ్చి భర్తీ చేయాలని టీచర్ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి కోరారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డికి తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావుతో కలిసి గురువారం వినతిపత్రం అందజేశారు. ‘‘బదిలీ అయినప్పటికీ చాలామంది టీచర్లు ఇంకా రిలీవ్ కాలేదు. వాళ్లందరినీ రిలీవ్ చేయాలి.

ఒకవేళ ఆ బడులకు టీచర్ల అవసరం ఉంటే వర్క్ అడ్జెస్ట్ మెంట్ లేదా విద్యావలంటీర్లతో పాఠాలు చెప్పించాలి. మ్యూచువల్ ట్రాన్స్ ఫర్ల ద్వారా వచ్చిన టీచర్లకు జిల్లాల్లో బదిలీలు నిర్వహించాలి” అని కోరారు.