కామారెడ్డి, వెలుగు : వచ్చే నెల 3నుంచి జరిగే శాసన మండలి సమావేశాల్లో టీచర్ల సమస్యలను ప్రస్తావించి, ప్రభుత్వాన్ని నిలదీస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి పేర్కొన్నారు. తపస్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సాందీపని డిగ్రీ కాలేజీలో గురు పూజోత్సవం నిర్వహించారు. ప్రోగ్రాంకు చీఫ్‌గెస్ట్‌గా హాజరైన ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. 2003 డీఎస్సీ టీచర్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌చేశారు. సీపీఎస్ విధానం రద్దుకు టీచర్లు చేసే పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
నగదు రహిత, అపరిమిత ఆరోగ్య కార్డులను జారీ చేయాలన్నారు. మెడికల్ బిల్స్, సంపాదిత సెలవుల బిల్లులను వెంటనే క్లియర్ చేయాలన్నారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించి కోర్టుల్లో ఉన్న కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. తపస్స్టేట్ ప్రెసిడెంట్ కె.హన్మంత్‌రావు, జనరల్ సెక్రెటరీ ఎన్. సురేశ్, జిల్లా ప్రెసిడెంట్ రాఘవరెడ్డి, జనరల్ సెక్రెటరీ బి.సంతోష్ పాల్గొన్నారు.