బీజేపీ ఎంపీలు కేంద్రం నుంచి ఏం తెచ్చారో చెప్పాలి : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

బీజేపీ ఎంపీలు కేంద్రం నుంచి ఏం తెచ్చారో చెప్పాలి : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
  • దమ్ముంటే దేశవ్యాప్తంగా కులగణన చేయాలె: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు కేంద్రం నుంచి ఏం నిధులు తీసుకొచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. రెండు సార్లు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు తేలేని బీజేపీ ఎంపీలకు మాట్లాడే అర్హత లేదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ రఘనందన్ వ్యాఖ్యలకు వెంకట్ కౌంటర్ ఇస్తూ.. విభజన హామీలపై బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌లో నోరు మెదపరని, రాష్ట్రంలో మాత్రం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ పబ్బం గడుపుతారని విమర్శించారు.

బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేస్తే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘బీసీల మీద ఎవరికి చిత్తశుద్ధి ఉందో ప్రజలకు తెలుసు. బీజేపీకి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే.. దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం బీజేపీ ఎంపీలు కొట్లాడాలి” అని అన్నారు.