![బస్సెక్కిన బల్మూరి,. ఆటోలో పాడి](https://static.v6velugu.com/uploads/2024/02/mlc-balmoor-venkat-went-to-assembly-by-rtc-bus_HY5IVgXWKQ.jpg)
- హుజూరాబాద్ లీడర్ల న్యూ స్టైల్
- అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
హైదరాబాద్: హుజూరాబాద్ కు చెందిన ఇద్దరు లీడర్లు ఇవాళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచింతంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన నేపథ్యంలో వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నాంపల్లి నుంచి అసెంబ్లీ వరకు ఆర్టీసీ బస్సులో వచ్చారు. మహిళలు ఎలా ఫీలవుతున్నారో అడిగి తెలుసుకున్నారు.
అయితే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గతానికి భిన్నంగా ఆటోలో అసెంబ్లీకి వచ్చారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందిని తెలుసుకొనేందుకు, ఆటో డ్రైవర్ల పక్షాన గళం వినిపించేందుకు ఆటోలో ఆయన అసెంబ్లీకి వచ్చారు. దీంతో ఇద్దరు హుజూరాబాద్ నేతలు ప్రత్యేక ఆకర్షణగా మారారు.