
- ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
నిజామాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శ్రేణులు కృషి చేయాలని జిల్లా సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సూచించారు. మంగళవారం డిచ్పల్లిలోని కేఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించిన జిల్లా సంస్థాగత మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. 2017కు ముందు నుంచి పార్టీలో ఉన్నవారికే పోస్టులు ఇవ్వాలనే హైకమాండ్ ఆదేశాలను అందరూ గౌరవించాలన్నారు. పార్టీ కోసం పని చేస్తే ప్రతి కార్యకర్తలు, నాయకులకు పదవులు దక్కుతాయన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు.
పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రతి సెగ్మెంట్‌కు పది వేల ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. గత బీఆర్ఎస్ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్ల పేర్లతో కమీషన్లు వసూలు చేసి పేదలను దోచుకున్నారని ఆరోపించారు. సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, ఆయా కార్పొరేషన్ చైర్మన్లు తాహెర్, మానాల మోహన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు, లైబ్రరీ కమిటీ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, డి.రాజేశ్వర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, నగేష్‌రెడ్డి, ముత్యాల సునీల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.