యాదాద్రి, వెలుగు : భువనగిరిలో కాంగ్రెస్ క్యాండిడేట్ చామల కిరణ్ గెలుపు కోసం ఎన్‌ఎస్‌యూఐ కీలకపాత్ర పోషించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. గురువారం భువనగిరిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోనే యువతకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామస్థాయిలో ప్రతి ఓటరును కలిసి కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి, ప్రధాని మోదీ చేసిన మోసాల గురించి వివరించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో భువనగిరి క్యాండిడేట్ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్‌కుమార్, జనగామ, సూర్యాపేట ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు చిలువేరు అభిగౌడ్, కందుకూరి అంబేద్కర్, పవన్ పాల్గొన్నారు.