- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వమే జీవో 81 ఇచ్చిందని.. దానినే అధికారులు ఇప్పుడు అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. జీవోలో వేకెన్సీ పోజీషన్లో మార్పులు చేసి గురుకుల నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే సమస్యే ఉండేది కాదన్నారు. బుధవారం గాంధీ భవన్లో ఎస్సీ సెల్ నేత ప్రీతమ్‌తో కలిసి వెంకట్ మీడియాతో మాట్లాడారు. ఎక్స్‌లో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలకు వెంకట్ కౌంటర్ ఇచ్చారు.
ఆర్ఎస్ ప్రవీణ్, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులో ఎవరు చర్చకు వచ్చినా సిద్దమని సవాల్ విసిరారు. జీవోలో మార్పులు చేద్దామని ఆర్ఎస్పీ చెప్పినా కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు వినలేదన్నారు. భవిష్యత్‌లో జీవోతో ఇబ్బందులు ఎదురు అవుతాయని మీకు తెలియదా అని ఆర్ఎస్పీని వెంకట్ ప్రశ్నించారు. జీవో 46, 81 బీఆర్ ఎస్ ప్రభుత్వమే ఇచ్చిందన్నారు.