
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన14 నెలల్లో 56 వేల ఉద్యోగాలిచ్చిందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. మండలిలో మాట్లాడిన ఆయన..తమ ప్రభుత్వం వచ్చాక నియామకాలు పకడ్భందీగా చేపట్టామన్నారు. 2017లో వచ్చిన నోటిఫికేషన్ కు మొన్న నియామకపత్రం ఇచ్చామన్నారు. నోటిఫికేషన్ వచ్చాక ఏడేళ్లకు ఉద్యోగం వచ్చిందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు భరోసా ఇవ్వలేకపోయారని ధ్వజమెత్తారు. నోటిఫికేషన్ ఎపుడిస్తారో తెలియని పరిస్థితి ఉండేది. పదేళ్లు ఏం చేయలేనోళ్లు తమను ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. 2014 బీజేపీ మేనిఫేస్టోలో 300లకు పై చిలుకు హామీలున్నాయి. ఎన్ని హామీలు మోదీ సర్కార్ నెరవేర్చిందని ప్రశ్నించారు. నీళ్లతో కాలేశ్వరం స్కాం చేశారు.. అడ్డగోలుగా రాష్ట్ర ఖజానాను దోచేశారని ఆరోపించారు పేపర్ లీక్ తో నియామకపత్రాలు స్కాం చేశారు. నీళ్లు,నిధులు,నియామకాల పేరుతో రాష్ట్రాన్ని దోచేశారన్నారు బల్మూరి వెంకట్.
Also Raed : గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో.. మీకంటే ఎక్కువ రుణమాఫీ చేశాం
11 వేల టీచర్ పోస్టులను 50రోజుల్లో భర్తీ చేశాం. వందేండ్ల యూనివర్శిటీ చరిత్రలో దళిత వీసీని నియమించాం. యూనివర్శిటీలను గాలికొదిలేసిన చరిత్ర మీది. 22 వేట టీచర్లకు ప్రమోషన్లు 36 వేల టీచర్లకు బదిలీలో చేశాం. హాస్టల్లో డైట్ చార్జీలు పెంచాం..అంతర్జాయతీ ప్రమాణాలతో స్కూళ్లు నిర్మిస్తు్న్నాం. పదేండ్లు విద్యాశాఖను గాలికొదిలేశారని మండిపడ్డారు బల్మూరి.