నోరు అదుపులో పెట్టుకో... కౌశిక్ రెడ్డికి బల్మూరి వెంకట్ వార్నింగ్

కరీంనగర్ కలెక్టరేట్  ఘటనపై రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్సీ  బల్మూరి వెంకట్.  నోరు అదుపులో పెట్టుకుని ఒక ఎమ్మెల్యేలా ప్రవర్తించాలని కౌశిక్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.  మీడియాలోకి రావడానికే  బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్టంట్లు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా మాట్లాడాలో కౌశిక్ రెడ్డికి తెలియదన్నారు. పార్టీలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దళితులను మోసం చేసిందే బీఆర్ఎస్ అని అన్నారు బల్మూరి. ఎమ్మెల్యే కౌశిక్  వీధి రౌడివలే ప్రవర్తించకూడదన్నారు. 

 కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కలెక్టరేట్లో  ఆదివారం (జనవరి 12) జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నాడు. ‘‘నువ్వు ఏ పార్టీలో గెలిచి, ఏ పార్టీలోకి వెళ్లావు. అసలు నీది ఏ పార్టీ’’ అంటూ కౌశిక్ రెడ్డి నిలదీశాడు. దీంతో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రుల ముందే ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరిని ఒకరు తోసుకున్నారు.  వెంటనే అప్రమత్తమైన పోలీసులు సమావేశం నుండి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బయటకు లాక్కెళ్లారు. కౌశిక్ రెడ్డి, సంజయ్‎ల వాగ్వాదంతో సమావేశంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

ALSO READ | కౌశిక్ రెడ్డిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటాం: మంత్రి శ్రీధర్ బాబు

మరో వైపు ఈ వివాదంపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు.  ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు . ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు