
శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ముదిరాజ్ ను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు ఇవాళ నామినేమిన్ వేయాల్సిందిగా ఆయనకు సూచించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలని పార్టీ నాయకులకు కేసీఆర్ చెప్పారు. ఇవాళ ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ చైర్మన్‌ను సభ్యులు ఎన్నుకోనున్నారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమే అవుతుందని చెబుతున్నారు. మండలి డిప్యూటీ ఛైర్మన్ గా నేతి విద్యాసాగర్ రావు పదవి కాలం పూర్తయినప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. బండ ప్రకాశ్ 2021 లో ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎంపికయ్యారు.