హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడంతో తనకు సొంత ఇంటికి వచ్చినట్టు ఉందని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. తన రాజకీయ గురువు, మాజీ ఎంపీ రామసాయం సురేందర్ రెడ్డి ఆహ్వానం మేరకు తిరిగి కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో తాను క్రియాశీలకంగా పనిచేశానని, అందరిలా పదవుల కోసం పార్టీలు మారలేదన్నారు. విద్యార్థి దశ నుంచే తాను రాజకీయాల్లో ఉన్నానని, వరంగల్ జిల్లాలో ఎవరి క్రెడిబిలిటీ వారికి ఉంటుందని, తనను ఇంకొకరితో పోల్చవద్దని పేర్కొన్నారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని చెప్పారు.