బీఆర్​ఎస్​ పాలనలోనే అజాంజాహి కబ్జా : ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య

బీఆర్​ఎస్​ పాలనలోనే అజాంజాహి కబ్జా : ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య

వరంగల్​ సిటీ, వెలుగు: పూటకోమాట, రోజుకో వేషం వేసే వాడిని కాదని, కార్మికుల హక్కుల కోసం, సంక్షేమం కోసం పోరాడుతానని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. ఇటీవల వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆజాంజాహి మిల్లు స్థలం కబ్జాపై చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

ఆ స్థలం కబ్జా పై ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే స్పందించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలోనే కబ్జా మొదలైందని, పదేండ్లలోనే కబ్జాకు గురైందని ఆరోపించారు. దమ్ముంటే చర్చకు సిద్ధంగా ఉండాలని, ఆ సమయంలో నరేందర్​ ఎమ్మెల్యే కాదా అంటూ ప్రశ్నించారు. కార్పొరేటర్​ నరేందర్​, ప్రభాకర్, రాజు తదితరులున్నారు.