
కూటమి ప్రభుత్వం అర్దంలేని ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. శాసనమండలిలో తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్న కూటమి నేతలు మాజీ ముఖ్యమంత్రి జగన్ న భూ బకాసురుడు అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఏ అంశంపై చర్చ జరిగినా సమాధానం చెపుతామన్న ప్రభుత్వ పెద్దలు అర్దంపర్దంలేని ఆరోపణలు చేస్తూ సమాధానాలు చెప్పడం లేదని ఏపీ శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. తాము 2014 నుంచి జరిగిన స్కాముల గురించి అడుగ్గా అమరావతి భూములు, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్, అగ్రిగోల్డ్ దందాలు అన్నింటిపై విచారణ జరపాలంటూ.. గత వైసీపీప్రభుత్వం గురించి ఆధారాలు లేకుండా విమర్శించడం సరికాదన్నారు.