
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానిలనేది ఆ రోజుకు మా విధానమని.. - రాజధానిపై ఇప్పుడు మా విధానం ఏమిటనేది పార్టీలో చర్చించి చెబుతామని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాజధానిపై మా విధానం ఏమిటనే విషయాన్ని డిస్కస్ చేసుకుని చెబుతామని అన్నారు. అమరావతి స్మశానంలా ఉందని నేను వ్యాఖ్యానించిన మాట వాస్తవమేనని.. అయితే- ఆరేళ్ల క్రితం అప్పటి సందర్భాన్ని బట్టి అలా మాట్లాడానని క్లారిటీ ఇచ్చారు.
టీడీపీ హయాంలో అమరావతి కోసం రూ.6 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని..- అమరావతి వల్లకాడులా మారింది అక్కడికి వెళ్లి ఏం చేస్తామని గతంలో నేను మాట్లాడానని ఒప్పుకున్నారు. కాగా, ఏపీకి మూడు రాజధానులనేది వైసీపీ విధానం. అయితే.. రాజధాని విషయంలో మా విధానం ఏంటనేది చర్చించుకుని చెబుతామని బొత్స అనడంతో కొత్త చర్చకు దారి తీసింది. రాజధాని విషయంలో వైసీపీ తమ వైఖరి మార్చుకుందా అన్న చర్చలు మొదలయ్యాయి. మరీ దీనిపై వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇస్తేగాని తెలియదు.