నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యిందని తెలిపారు కలెక్టర్ హరిచందన. ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో అభ్యర్థులెవ్వరికీ 50శాతం ఓట్లు రాలేదని వెల్లడించారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తామన్నారు ఆర్వో హరిచందన. అభ్యర్థులు ఓట్లను చూపించాలనడంతోనే.. ఓట్ల లెక్కింపు ఆలస్యం అవుతుందని చెప్పారు.
నాలుగు రౌండ్ల పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు లక్షా 22 వేల 513 ఓట్లు వచ్చాయని ఆర్వో తెలిపారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థికి రాకేశ్ రెడ్డికి లక్షా 4వేల 248ఓట్లు వచ్చాయన్నారు. ఇక, మొదటి ప్రాధాన్యత ఓట్లలో తీన్మార్ మల్లన్న -18 వేల565 ఆధిక్యంలో ఉన్నారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో విజేత తేలే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.