- గవర్నర్కు వినతిపత్రం అందజేస్తున్న బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న టీచర్ల సమస్యలతో పాటు విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య కోరారు. సోమవారం హైదరాబాద్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు.
సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ విధానం తీసుకురావాలని గవర్నర్ను కోరారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు తగ్గట్టుగా విద్యార్థులను సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానం–2020ని తెలంగాణలోనూ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. టీచర్లు, ఉద్యోగులు, పింఛనర్లకు పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే రిలీజ్ చేయాలన్నారు.