కాగజ్ నగర్, వెలుగు: ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. మంగళవారం కౌటాల మండలంలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్పాలనలో ప్రజలు అన్యాయానికి గురయ్యారని, పదేండ్ల తర్వాత ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని, ఇచ్చి హామీలన్నీ అమలు చేస్తామన్నారు.
ఈ సందర్భంగా పలువురు పార్టీలో చేరగా ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సిడం గణపతి, మాజీ ఎంపీపీలు బసార్కర్ విశ్వనాథ్, డబ్బుల నానయ్య, నికోడె గంగారాం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్దన్ తదితరులు ఉన్నారు.