ప్రొడ్యూసర్ దిల్ రాజుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత దేశపతి శ్రీనివాస్. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫంక్షన్ లో దిల్ రాజు తెలంగాణ కల్చర్ ను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్ రాజుకు ఆంధ్రాలోనే సినిమాలకు వైబ్ ఉంటుందట .. తెలంగాణలో ఉండదట అని విమర్శించారు. తెలంగాణలో వైబ్ లేకపోతే.. ఇక్కడ సినిమాలు చేయటం మానుకోవాలన్నారు. ఇక్కడ వైబ్ ఉండదన్న దిల్ రాజు..తెలంగాణలో సినిమాలు మానుకుని కల్లు, మాంసం దుకాణాలు పెట్టుకోవాలని సూచించారు దేశపతి. తెలంగాణ ఉద్యమ సమయంలో దిల్ రాజు ఏనాడు మద్దతివ్వలేదన్నారు.
ALSO READ | GameChanger: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' టికెట్ల ధర పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్రైలర్ లాంచ్ లో మాట్లాడిన దిల్ రాజు.. ఏపీలో ప్రజలు సినిమాలతో అలరిస్తారు.. తెలంగాణ ప్రజలు కల్లు,మటన్ తో అలరిస్తారని వ్యాఖ్యానించారు. దీనిపై పలువురు బీఆర్ఎస్ నేతలు, తెలంగాణ ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి.