ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన ప్రచారం.. 27న పోలింగ్

ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన ప్రచారం.. 27న పోలింగ్

గురువారం ( ఫిబ్రవరి 27 ) పట్టభద్రుల, టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి.ఉమ్మడి కరీంనగర్ – నిజామాబాద్– ఆదిలాబాద్ – మెదక్  జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, నల్గొండ– ఖమ్మం–వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ఇవాళ ( ఫిబ్రవరి 25 ) సాయంత్రం 4 గంటలకు గడువు ముగిసింది. దీంతో ఆయా జిల్లాల్లో మద్యం షాపులు మూతపడ్డాయి. ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న ఈ పోలింగ్ కి ఇప్పటికే అని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. 

నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పోలింగ్ కేంద్రాలు:

పట్టభద్రుల, టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నాలుగు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 680 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. 

  • 93 కామన్ పోలింగ్ స్టేషన్లు( టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ ),
  • 406 గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్లు, 
  • 181 టీచర్స్ పోలింగ్ స్టేషన్లు, 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 210 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలు

  • జగిత్యాల జిల్లాలో పోలింగ్ కేంద్రాలు: 51
  • కరీంనగర్ జిల్లాలో : 85
  • రాజన్న సిరిసిల్ల : 28
  • పెద్దపల్లి : 36
  • హనుమకొండ, సిద్ధిపేట, భూపాలపల్లి జిల్లాలో మరో 10 కేంద్రాలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలు: 65

  • జగిత్యాల జిల్లాలో: 20
  • పెద్దపల్లి జిల్లాలో: 14
  • కరీంనగర్ : 18
  • రాజన్న సిరిసిల్ల -13
  • హనుమకొండ, సిద్ధిపేట, భూపాలపల్లి జిల్లాలో మరో 9 కేంద్రాలు