
- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ
కామారెడ్డి, వెలుగు : ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు తెలంగాణ భవిష్యత్‌ను నిర్దేశిస్తాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. కరీంనగర్గ్రాడ్యుయేట్, టీచర్ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్య తరఫున సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రచారం నిర్వహించి అడ్వకేట్లను, లైబ్రరీలో గ్రాడ్యుయేట్లను కలిసిన అనంతరం పార్టీ జిల్లా ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో భవిష్యత్ లో డబుల్ఇంజన్సర్కారు రావాలని ప్రజల ఆకాంక్షిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిపించాలని ఆమె కోరారు. పార్టీ జిల్లా ప్రెసిడెంట్నీలంచిన్న రాజులు, జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీపాటిల్, మాజీ ఎమ్మెల్యే అరుణతార, తదితరులు పాల్గొన్నారు.