
తెలంగాణలోని ఉమ్మడి ఏడు జిల్లాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం(ఫిబ్రవరి 27) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు ఓటర్లు.
సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతోంది.
మొత్తం మూడు నియోజకవర్గాల్లో 75 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 3,55,159 మంది ఓటర్లు హాజరవ్వనుండగా, 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 27,088 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదయ్యారు. ఈ స్థానంలో 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.