తాను ఏ పార్టీలో ఉన్నా పార్టీ నిర్ణయాలకే కట్టుబడి ఉన్నానని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యేలతో ఉన్న భేధాభిప్రాయాలతో తాను పార్టీ వీడుతున్నానంటూ ప్రచారం చేయడం సరికాదన్నారు.
పార్టీలు మారాల్సిన అవసరం తనలాంటి వాళ్లకు లేదన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. పార్టీ ఆదేశిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాను కానీ ... తన కుమారుడు అమిత్ కానీ పోటీలో ఉంటామని తెలిపారు. మూడోసారి కేసీఆర్ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.