రుణమాఫీపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి : ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

రుణమాఫీపై  ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి  : ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి

రాయికల్​, వెలుగు: రైతు రుణమాఫీపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌రెడ్డి విమర్శించారు. జగిత్యాల జిల్లా రాయికల్‌‌‌‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తున్నట్లు చెప్పారు.  

ఇక నుంచి రైతు బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 25 శాతం చొప్పున, రైతులు 50శాతం ప్రీమియం చెల్లించేవారన్నారు. గతంలో  యూపీఎ హయాంలోనూ ఏకకాలంలో రూ. లక్ష రుణమాఫీ చేసినట్లు గుర్తుచేశారు. ప్రతిపక్షాలు రైతులను కన్య్ఫూజన్‌‌‌‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు.

రేషన్ కార్డు అనేది కుటుంబాన్ని ఓ యూనిట్‌‌‌‌గా తీసుకునేందుకు మాత్రమేనన్నారు. అసలైన రైతులను గుర్తించి రైతు భరోసా అందిస్తామన్నారు. ఆయనతోపాటు కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు రవీందర్‌‌‌‌‌‌‌‌రావు, మాజీ జడ్పీటీసీ గోపి రాజరెడ్డి, లీడర్లు నర్సయ్య, రమేశ్‌‌‌‌, భూమయ్య, దివాకర్​రెడ్డి, మహిపాల్​రెడ్డి పాల్గొన్నారు.