జగిత్యాల టౌన్, రాయికల్, వెలుగు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 74వ జన్మదిన వేడుకలను ఆదివారం జగిత్యాలలోని ఇందిరాభవన్ లో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. జీవన్ రెడ్డి ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం పట్టణంలోని పలు ఆలయాల్లో జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బర్త్ డే సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లాలోని నలుమూలల నుంచి కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. క్రేన్ సహాయంతో భారీ గజమాలను వేసి సన్మానించారు. అనంతరం అభిమానులు తెచ్చిన 74కిలోల భారీ కేక్ ను కట్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ జగిత్యాల అంటే జీవన్ రెడ్డి.. జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అనే విధంగా అభివృద్ధి చేశానని అన్నారు. అగ్రికల్చర్ కాలేజ్, న్యాక్ శిక్షణ కేంద్రం, మహిళా డిగ్రీ కాలేజీ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ తన హయాంలో ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, గాజెంగి నందయ్య, భారతి, రాజేందర్, రాజేందర్, మహిపాల్ రెడ్డి, ఎండీ సలీం, నిశాంత్ రెడ్డి, సంతోష్, అశోక్, హరికృష్ణ, రాధ, మహేశ్, రాంచంద్రారెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
రాయికల్ పట్టణంలోని అంగడి బజార్ లో పట్టణ, మండల మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గోపి మాధవి, పట్టణ అధ్యక్షురాలు మమత, మున్సిపల్ కౌన్సిలర్ అనురాధ, కార్యకర్తలు పాల్గొన్నారు.
కరీంనగర్ సిటీ, వెలుగు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కేక్ కట్ చేశారు. లీడర్లు అర్ష మల్లేశం, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, లత, కవిత, తిరుమల, రమేశ్, జైపాల్, జ్యోతిరెడ్డి, మెరాజ్
పాల్గొన్నారు.