కేసీఆర్ పాలనలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలే: జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్, వెలుగు: కేసీఆర్ పాలనలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని జగిత్యాల కాంగ్రెస్​అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం బావోజీపల్లి, గొల్లపల్లె గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు. బావోజీపల్లి లో ఎమ్మెల్సీ సమక్షంలో 100 మంది ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు మారుతాయని, ఉద్యోగాలు లభిస్తాయని ఆశించిన యువతకు నిరాశే మిగిలిందన్నారు. కాంగ్రెస్ పాలనలో రేషన్ కార్డు మీద 9 రకాల నిత్యావసర సరుకులు అందించామని, కేసీఆర్ బియ్యం తప్పా అన్ని రద్దు చేసిండన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, తమను ఆదరించి, ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.