జగిత్యాల టౌన్, వెలుగు: ధరణితో రైతులకు సమస్యలు పుట్టుకొచ్చాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపిం చారు. బుధవారం పట్టణంలోని ఇందిరా భవన్ లో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ధరణిని రద్దు చేస్తే మళ్లీ పటేల్, పట్వారీ వ్యవస్థ వస్తుందని మంత్రి హరీశ్ రావు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పట్వారీ వ్యవస్థ కేసీఆర్ ఎమ్మెల్యే కాకముందే రద్దయిందని గుర్తు చేశారు.
ALS0 READ: ధరణితోనే అన్ని సమస్యలు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ధరణి సమస్యలు లేని గ్రామం ఒకటైనా ఉందా అని మంత్రి హరీశ్‌ను ప్రశ్నించారు. ధరణిలో నమోదు కాని డాక్యుమెంట్స్ వేలల్లో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నాలుగు నెలల్లో జిల్లాకొక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ధరణి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్లకు ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరిస్తామన్నారు. కార్యక్రమంలో నాగభూషణం, దుర్గయ్య, నందయ్య, మోహన్, రాజేందర్, రాజేందర్ పాల్గొన్నారు.