ఏం సాధించారని తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని రాష్ర్ట ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రోళ్ల వాగులో 1 టీఎంసీ నీరు నిల్వ చేసే వరకు ఓటు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు. జగిత్యాల చక్కెర కర్మాగారం తెరిపించడం ప్రభుత్వ బాధ్యత కాదా అని ప్రశ్నించారు. చక్కెర కర్మాగారం తెర్పించకుండా మంత్రి కేటీఆర్ జగిత్యాలలో అడుగు పెట్టవద్దని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ కామెంట్స్ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
రైతు బిడ్డగా, రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రుణమాఫీ ఎందుకు చేయడం లేదంటూ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లాలో చక్కెర కర్మాగారాన్ని తెరిపించడం మీ బాధ్యత కాదా అని మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. చక్కర కర్మాగారాన్ని తెరిపిస్తే తాము (కాంగ్రెస్) కూడా పాలాభిషేకం చేస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. చక్కర కర్మాగారాన్ని తెరిపించే వరకూ జగిత్యాలలో కేటీఆర్ అడుగుపెట్ట వద్దని హెచ్చరించారు.