జగిత్యాల టౌన్, వెలుగు: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేసేలా కృషి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం జగిత్యాలలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రిటైర్డ్ ఉద్యోగుల సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి వారికి రేషన్‌కార్డు, పెన్షన్ అందేలా కృషి చేస్తానన్నారు. అనంతరం జగిత్యాల అర్బన్ అంబరి పేట, నర్సింగపూర్ గ్రామాలను, టౌన్‌లోని టీఆర్‌నగర్‌ను సందర్శించారు. గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తానని జీవన్‌రెడ్డి హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ నాయకుడికి పరామర్శ
మల్యాల, వెలుగు: బీఆర్ఎస్ నాయకుడు, రైతు బంధు సమితి మండల కన్వీనర్ అల్లూరి రాజేశ్వర్ రెడ్డిని ఆదివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల రాజేశ్వర్ రెడ్డి తండ్రి నర్సింహా రెడ్డి చనిపోయారు. ఎమ్మెల్సీ వెంట కాంగ్రెస్ లీడర్లు ఆనందరెడ్డి, ఆదిరెడ్డి, లక్ష్మారెడ్డి, లాయర్సంత కిషన్ రెడ్డి, గురువారెడ్డి ఉన్నారు.