రాజకీయ కుట్ర అయితే ఆ పార్టీకే నష్టం జరుగుతుంది: జీవన్ రెడ్డి

బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దాడిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. రాజకీయ పార్టీ కుట్ర అయితే..  దాడి చేపించిన పార్టీకే నష్టం జరుగుతుందన్నారు. ఈ విషయం తెలిసి కూడా ఎవరైనా కుట్రకు పాల్పడుతారా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. 

దాడికి పాల్పడిన వ్యక్తి ఏ పరిస్థితుల్లో అలా చేశాడో విచారణ జరపాలని జీవన్ రెడ్డి అన్నారు. ఒక ఎంపీపై దాడి చేయడానికి ఆ వ్యక్తికి అంతటి ఆగ్రహం ఎందుకు వచ్చిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 

అతను జర్నలిస్టు కాబట్టి అన్ని పార్టీలతో సంబంధాలు ఉంటాయని తెలిపారు. జగిత్యాల పట్టణంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.