రానున్న ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్అవినీతిపై విచారణ కమిటీ వేస్తామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్‌లో ఆయన మాట్లాడుతూ.. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి సీఎం కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. భవిష్యత్తులో కాళేశ్వరాన్ని పర్యాటక కేంద్రంగా ఉంచనున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో తమ్మిడి హట్టి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కూడా చేర్చుతామని తెలిపారు. దశాబ్ది ఉత్సవాలు అని జరుపుకుంటున్న బీఆర్ఎస్ సర్కార్ దళితబంధు పథకం ఊసే ఎత్తట్లేదని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రజా ధనాన్ని పార్టీ ప్రచారానికి వినియోగించుకుంటోందని ఆరోపించారు.