కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే ఎస్ఎల్‌‌బీసీ ప్రమాదం.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే ఎస్ఎల్‌‌బీసీ ప్రమాదం..  కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్‌‌బీసీ విషయంలో కేసీఆర్ సర్కార్ చేసిన నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలోనే 55% పనులు పూర్తయ్యాయని, కేసీఆర్ అధికారంలోకి వచ్చిక ఏడాదికో కిలో మీటర్ చొప్పున తవ్వకాలు జరిపార న్నారు. 

పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ తన హయాంలోనే ఎస్ఎల్‌‌బీసీ పూర్తి చేస్తే ఇప్పుడు ఇలాంటి ఘటనలు  చోటుచేసుకునేవి కావన్నారు. తెలంగాణ ట్యాగ్ లైన్ అయిన నీళ్లు, నిధులు, నియామకాలలో కేసీఆర్ ఏ ఒక్కటి పూర్తి చేయలేక పోయారని విమర్శించారు. తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేయాలని సీఎం రేవంత్ కి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.