నెహ్రూ త్యాగాన్ని తగ్గించే కుట్ర.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

నెహ్రూ త్యాగాన్ని తగ్గించే కుట్ర.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
  • నెహ్రూ త్యాగాన్ని తగ్గించే కుట్ర
  • నెహ్రూ హయాంలోనే వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి
  • ‘నెహ్రూ.. ఇండియా డెమోక్రసీ’ సెమినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్న పలువురు వక్తలు

హైదరాబాద్, వెలుగు : మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలను, ఆయన త్యాగాన్ని తగ్గించేందుకు కొన్ని దుష్ట శక్తులు కుట్ర పన్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. దేశంలో వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి జరిగిందంటే అది నెహ్రూ హయాంలోనే అని చెప్పారు.

నెహ్రూ వర్ధంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాంపల్లిలోని ఇందిరా భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పీసీసీ మేధావుల సెల్ చైర్మన్ శ్యాం మోహన్ ఆధ్వర్యంలో “నెహ్రూ.. ఇండియా డెమోక్రసీ”అనే అంశంపై సెమినార్ జరిగింది. దీనికి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, సెంట్రల్ యూనివర్సిటీ మాజీ వీసీ రాజేన్ హర్షే, పార్టీ నేతలు నేరెళ్ల శారద, బెల్లయ్య నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు పలువురు కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాల నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో భారత్ నేడు ఈ స్థాయిలో ఉందంటే ప్రధానిగా ఆనాడు నెహ్రూ వేసిన పునాదులే కారణమన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చింది కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే అనే విషయాన్ని మరిచిపోరాదన్నారు. 

నెహ్రూను విమర్శిస్తున్నరు..

ఆర్ఎస్ఎస్, బీజేపీ.. నెహ్రూ ప్రతిష్టను తగ్గించే ప్రయత్నం చేశాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. దూరదృష్టితో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత నెహ్రూదని అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ మాజీ వీసీ రాజేన్ హర్షే మాట్లాడుతూ.. నెహ్రూ గొప్ప ప్రజాస్వామ్యవాదని కొనియాడారు. ఆలోచన స్వేచ్ఛను మేధో స్వేచ్ఛగా, పత్రికా స్వేచ్ఛగా ప్రోత్సహించారన్నారు.  నెహ్రూ వర్ధంతి సందర్భంగా అంతకు ముందు గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన చిత్రపటానికి పలువురు పూలమాల వేసి నివాళి అర్పించారు.

హిందువులకు చేసింది శూన్యం

కేంద్రంలో మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తేస్తుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం చేయాలని ప్రణాళికలు రచిస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఓట్ల కోసం పదేండ్లుగా మత విద్వేషాలు రెచ్చగొడుతోందని ఆయన ఆరోపించారు.

పదేండ్లలో హిందువులకు బీజేపీ చేసింది శూన్యమని ఆయన మండిపడ్డారు. సోమవారం గాంధీ భవన్ లో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్థిక వెనుకబాటు తనం అనే నెపంతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చారని దీంతో వెనుకబడిన వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు.