ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారుతడనే టాక్ ఉంది : జీవన్ రెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారుతడనే టాక్ ఉందని.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కి పార్టీ మారే ఆలోచన లేదన్నారు. తాను భట్టి విక్రమార్కను సంప్రదిస్తే ప్రేమ్ సాగర్ రావు పార్టీ మారే ఆలోచన లేదన్నారు. 

జగిత్యాల జిల్లాలోని  ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన  ప్రెస్ మీట్ లో జీవన్ రెడ్డి మాట్లాడుతూ..   ఎన్నికల నామినేషన్ వరకు ఎవరు ఏ పార్టీలో ఉంటే ఆ నాయకుడు పోటీలో ఉంటున్నట్లుగా అర్థం చేసుకోవాలన్నారు. తాను ఎంపీగా పోటీ చేయాలనుకుంటే తనకు ఎవరు అడ్డు కాదన్నారు. 

కరీంనగర్, నిజామాబాద్ లలో  పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుండైనా పోటీ చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని చెప్పారు.  మీరే ఓటెయ్యాలి మీరే నోటు ఇవ్వాలని నామినేషన్ వేసేంతవరకు తన వంతని ఆ తర్వాత పార్టీ నాయకుల వంతాన్నరు జీవన్ రెడ్డి.