ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ తల్లి విగ్రహ నమూనాపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై స్పందించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణ తల్లి చేయి హస్తం గుర్తును చూపిస్తుందని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం తప్పుని అన్నారు.ప్రస్తుత తెలంగాణ తల్లి విగ్రహం రైతు బిడ్డ రూపంలో ఉందన అన్నారు జీవన్ రెడ్డి.
తెలంగాణ తల్లి రవిక ఆరెంజ్, చీర ఆకుపచ్చ కలర్ లో ఉందని.. అంత మాత్రాన బిజెపి కి సంకేతంగా సూచిస్తుందా అని ప్యాశ్నించారు జీవన్ రెడ్డి. తెలంగాణ తల్లి విషయంలో బీర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు జీవన్ రెడ్డి.
గతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాచరిక వ్యవస్థకు అద్దం పట్టేలా రూపొందించారని.. కాంగ్రెస్ మాత్రం సామాజిక తెలంగాణ దృక్పథంతో ముందుకు సాగుతుందని అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన విజయవంతంగా సాగిందని.. ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు జీవన్ రెడ్డి.