కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ. 2లక్షల రుణమాఫీ: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. వరి క్వింటాల్ కు రూ. 5 వందలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నిక ధన, ప్రజా బలానికి మధ్య జరిగే ఎన్నికలని.. ఎన్ని రోజులు బతుకుతాననేది కాదు.. తాను ఏం చేస్తాననేదే ముఖ్యమన్నారు. ప్రజలకు తనపై విశ్వాసం ఉన్నంత వరకు పోటీ చేస్తూనే ఉంటానని వివరించారు. 

జగిత్యాల జిల్లా ధరూర్ గ్రామంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటి ఇంటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. చేతి గుర్తుకు ఓటు వేసి.. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.