తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అందరికీ విద్య, ఉద్యోగ అవకాశాలు వస్తాయని భావించామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమ విద్య కలిపిస్తున్నామని చెప్పి.. దాన్ని కేవలం ప్రకటనలకే పరిమితం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్స్ లేకుండా చేశారని.. మౌలిక సదుపాయాలు కూడా లేకుండా పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో.. తల్లిదండ్రులు ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ ను ఆశ్రయిస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు.
రాష్ట్రంలో 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. 33 మంది డీఈవోలకు.. కేవలం నలుగురు మాత్రమే పని చేస్తున్నారని విమర్శించారు. పాఠశాలల్లో ఒక టీచర్ పని చేసే.. వారికే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉపాధ్యాయులు బోధన చేయలేక పోతున్నారన్నారు.
రాష్ట్రంలో టెట్ క్వాలిఫై అయిన నిరుద్యోగులు 4లక్షల మంది ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం ఉపాధ్యాయ భర్తీని పూర్తిగా చేయలేక పోతుందని తెలిపారు. డీఈఓ, ఎంఈఓ, హెచ్ఎం పోస్టులు అన్ని కాలిలే ఉన్నాయి. కాలిగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యాలంటరీ వ్యవస్థను పునర్ వ్యవస్థీకరణ చేయాలన్నారు. వీటిపై వెంటనే సీఎం కేసీఆర్ స్పందించాలని లేఖ రాస్తున్నానని జీవన్ రెడ్డి తెలిపారు.