జగిత్యాల రూరల్, వెలుగు: రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో జగిత్యాల అర్బన్, రూరల్, రాయికల్, బీర్పూర్, సారంగాపూర్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ కన్నా కాంగ్రెస్ పాలన మెరుగ్గా సాగుతోందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి త్వరలోనే రేషన్ కార్డుల జారీ చేస్తామన్నారు. లిస్టులో పేర్లు రాని దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, బండ శంకర్, జున్ను రాజేందర్, పాల్గొన్నారు.