కేసీఆర్ తెలివి ఎంత ఉపయోగపడుతుందో చూడండి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

కేసీఆర్ తెలివి ఎంత ఉపయోగపడుతుందో చూడండి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

రాష్ట్రంలో తాగుడు తగ్గువైందని మందు రేట్లు తగ్గించిండని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. మే 6వ తేదీ శనివారం ఆయన జగిత్యాల జిల్లాలోని ఇథానాల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పాశిగామ గ్రామస్తులకు సంఘీభావం తెలపడానికి వెళ్లారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి కేసీఆర్ సర్కారుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మందు రేట్లు తగ్గించిండు కేసీఆర్.. ఆయనకు మందుబాబులపై ఇంత ప్రేమ పుట్టినందుకు ఆశ్చర్యపోయానని జీవన్ రెడ్డి తెలిపారు.

అయితే ఇక్కడే కేసీఆర్ తెలివిని గ్రహించాలె.. కేవలం మందు రేట్లు తగ్గించిండు..కానీ బీర్ల రేట్లు మాత్రం తగ్గించలేదన్నారు జీవన్ రెడ్డి. ఎందుకంటే ఎండాకాలం చల్లటి బీర్లు ఎక్కువ తాగుతారని.. అందుకే వాటి రేట్లు తగ్గించలేదు.. మరి బీర్ల రేట్లు చలికాలం తగ్గిస్తాడు కావచ్చని తెలిపారు. మందుపైన తగ్గించునోడు మరి బీర్ల మీద తగ్గించడా అని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. కేసీఆర్ తెలివి ఎంత ఉపయోగపడుతుందో చూడండి అంటూ జీవన్ రెడ్డి చమత్కరించారు. మందుపై రేట్లు దగ్గించాడు.. కానీ ప్రజలకు కావలసిన నిత్యావసరాలు పప్పు, ఉప్పు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించరా అని జీవన్ రెడ్డి నిలదీశారు.